రేవల్లి మండలంలో ముంచేస్తున్న ముసురు ==చేతికొచ్చిన పంట, రైతు కంట నీరు ==రోడ్లు దెబ్బతిని బురదమయంగా మారి వాహనదారులకు ఇబ్బందులు
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురుకు చేతికొచ్చిన పంట నష్టాన్ని కలిగిస్తుంది రైతన్నకు దీంతో రైతు కట్ట తడి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోతకు వచ్చిన పంటను ఆరాబెట్టుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ సతమతపడుతున్నాడు రైతన్న. చాలా రోజుల నుంచి గత వర్షాలకు రోడ్లు దెబ్బతిని బురద మయంగా మారి రేవల్లి మండల కేంద్రం నుండి వనపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లాలన్న ఇటు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రానికి అలాగే తలపునూరు గ్రామాలకు వెళ్లాలన్న వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ గుంత ఉందో ఎక్కడ మంచిగా రోడ్డు ఉందో అర్థం కాక తమ ప్రయాణాన్ని అష్ట కష్టాల మీద గమ్యాన్ని చేరుకుంటున్నారు.ఇలాగే ఎడతెరిపి లేకుండా వర్షం గాని, ముసరుగాని పడితే రేవల్లి మండలంలోని పలు గ్రామాలు రోడ్లు అలాగే పంట నష్టం కలిగే అవకాశం ఉందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.